Maguva Maguva Song Lyrics – Telugu :

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ‘వకీల్ సాబ్’ చిత్రంలోని ‘మగువా మగువా’ పాట ఆదివారం విడుదలైంది. ‘పింక్’ చిత్రానికి రీమేక్‌గా ‘వకీల్ సాబ్’ రూపొందుతోంది.

 

Maguva Maguva Song

రామజోగయ్య శాస్త్రి గారు ఇప్పటికే ఎన్నో అద్భుతమైన పాటలు రాశారు. రామజోగయ్య శాస్త్రి గారు ఫలానా పాట మాత్రమే రాయగలరని చెప్పడానికి ఎవరూ సరిపోరు. ఎందుకంటే ఆయన కలంలోని పాటల్లో మెలోడీలు.. మాస్ మసాలాలు.. భక్తిగీతాలు.. ఎమోషనల్ సాంగ్స్ ఉంటాయి. ‘రఘువరన్ బీటెక్’ సినిమాలో రాంజీ రాసిన ‘అమ్మా అమ్మా నీ పసివన్నమ్మా’ పాట అందరినీ కంటతడి పెట్టిస్తుంది. మళ్లీ ఇంత గొప్ప సాహిత్యంతో స్త్రీల ఔన్నత్యాన్ని వివరిస్తూ రాంజీ ‘మగువా మగువా’ అనే పాట రాశారు.

Movie : వకీల్ సాబ్. (Vakeel Saab)

Song : మగువ మగువ (Maguva Maguva)

Singer : సిద్ శ్రీరాం (Sid Sreeram)

Lyrics writer : రామ జోగయ్య శాస్త్రి (Ramajogayya Sastri)

Music : తమన్.ఎస్ (Taman.s)

 

Maguva Maguva Song Lyrics – Telugu – Vakeel Saab

 

మగువా మగువా లోకానికి తెలుసా నీ విలువా..

మగువా మగువా నీ సహనానికి సరిహద్దులు కలవా..

 

అటు ఇటు అన్నింటా, నువ్వే జగమంతా

పరుగులు తీస్తావు ఇంటా బయట…

అలుపని రవ్వంత అననే అనవంట…

వెలుగులు పూస్తావు వెళ్లే దారంత…

స.. గ.మ.ప.మ.గ.స… గ.మ.ప.మ.గ.స… గ.మ.ప.మ.గ… గ.మ.ప.మ.గ… గ.మ.ప.గ.స…

 

మగువా మగువా లోకానికి తెలుసా నీ విలువా..

మగువా మగువా నీ సహనానికి సరిహద్దులు కలవా..

 

చరణం:

నీ కాటుక కనులు విప్పారకపోతే ఈ భూమికి తెలవారదుగా…

నీ గాజుల చేయి కదలాడకపోతే ఏ మనుగడ కొనసాగదుగా…

ప్రతి వరసలోను ప్రేమగా అల్లుకున్న బంధమా అంతులేని నీ శ్రమా అంచనాలకందునా…

 

ఆలయాలు కోరని ఆదిశక్తి రూపమా నీవులేని జగతిలో దీపమే వెలుగునా…

నీదగు లాలనలో ప్రియమగు పాలనలో ప్రతి ఒక మగవాడు పసివాడేగా…

ఎందరి పెదవులలో ఏ చిరునవ్వున్నా ఆ సిరి మెరుపులకు మూలం నువ్వేగా…

 

స.. గ.మ.ప.మ.గ.స… గ.మ.ప.మ.గ.స… గ.మ.ప.మ.గ… గ.మ.ప.మ.గ… గ.మ.ప.మ.గ.స…

 

మగువా మగువా లోకానికి తెలుసా నీ విలువా…

మగువా మగువా నీ సహనానికి సరిహద్దులు కలవా…

 

Maguva Maguva Song Telugu Lyrics – Vakeel Saab – watch this Video song.

Please watch to Prapanchamantha kore raamude nuvve lyrics

And watch to Padara Sainika Lyrics in English & Telugu

 

Share to

Leave a Reply