Oke Oka Jeevitham Song Lyrics from Amma Song Lyrics – Sid Sriram
Singer | Sid Sriram |
Song | Amma Song |
Music | Jakes Bejoy |
Song Writer | Sirivennela Seetharama Sastry. |
Oke Oka Jeevitham Song Lyrics – Amma Song :
ఓకే ఒక జీవితం: ‘అమ్మ’ సాంగ్ సాంగ్ వీడియో.. శర్వానంద్ కెరీర్‌లో బెస్ట్ సాంగ్
అమ్మ మాటల్లో ఉన్నంత మాధుర్యం ఈ పాటలో ఉంది. సిరివానెల సీతారామశాస్త్రి లేకపోయినా పాటగా బతుకుతుందని ఈ అమ్మ పాట చెబుతోంది. శర్వానంద్, రీతూ వర్మ జంటగా నటించిన ‘ఓకే ఓకే జీవన్’ చిత్రంలోని ‘అమ్మ’ పాట బుధవారం విడుదలైంది. సంచలన గాయకుడు సిద్ శ్రీరామ్ పాడిన ఈ పాటకు ‘జేక్ బెజోయ్’ స్వరాలు సమకూర్చారు. సిరివేనెల సీతారాం శాస్త్రి సాహిత్యం అందించారు. మళ్లీ మళ్లీ వినాలనిపించే ఈ అమ్మ పాట సాహిత్యం మీకోసం..
Oke Oka Jeevitham Lyrics in Telugu:
అమ్మా!! వినమ్మా.. నేనాటి నీ లాలి పదన్నే
ఓ!! ఔనమ్మా.. నేనేమ్మా.. నువ్ ఏనాడో కనిపెంచిన స్వరాన్నే
మౌనమై ఇన్నాళ్లూ నిదరలోనే ఉన్నా..
గానమై ఈనాడే మేలుకున్నా..
నీ పాదాలకు మువ్వల్లా నా అడుగులు సాగాలమ్మా..
నీ పెదవుల చిరునవ్వుల్లా నా ఊపిరి వెలగాలమ్మా..
నిరంతరం నీ చంటిపాపల్లే ఉండాలినే నెన్నాళ్లకీ..
నిన్నొదిలేంతగ ఎదగాలనుకోనే అమ్మా…
అణువణువు నీ కొలువే అమ్మా..
ఎదసడిలో శ్రుతిలయలు నువే అమ్మా..
అమ్మా.. నే కొలిచే శారదవే
నను నిత్యం నడిపే సారధివే
బెదురుపోవాలంటే నువ్వు కనిపించాలి
నిదరావాలంటే కథలు వినిపించాలి
ఆకలయ్యిందంటే నువ్వెతినిపించాలి
ప్రతి మెతుకు నా బతుకు అనిపించేలా..
నువ్వుంటేనే నేనూ..
నువ్వంటేనే నేనూ..
అనుకోలేకపోతే ఏమైపోతాను
నీ కడ చూపే నన్ను కాస్తూ ఉండక
తడబడి పడిపోనా చెప్పమ్మా
మరి మరి నునునువు మురిపెంగా చూస్తూ ఉంటే చాలమ్మా
పరిపరి విధముల గెలుపులుగా పైకెదుగుతు ఉంటానమ్మా..
అయినా సరే ఏనాటికీ ఉంటాను నీ పాపాయినై
నిన్నొదిలేంతగా ఎదగాలనుకోనే
నిరంతరం నీ చంటిపాపల్లే ఉండాలినే నెన్నాళ్లకీ..
నిరంతరం నీ చంటిపాపల్లే ఉండాలినే నెన్నాళ్లకీ..
నిరంతరం నీ చంటిపాపల్లే ఉండాలినే నెన్నాళ్లకీ..
నిన్నొదిలేంతగ ఎదగాలనుకోనే అమ్మా….
అణువణువు నీ కొలువే అమ్మా..
ఎదసడిలో శ్రుతిలయలు నువే అమ్మా..
అమ్మా.. నే కొలిచే శారదవే
నను నిత్యం నడిపే సారధివే
Oke Oka Jeevitham Song Lyrics in Amma Song Watch Video
And watch toKarpur Gauram Karunavtaram Song Lyrics in English & Hindi